Home సినిమా వార్తలు A Double Treat for Sreeleela Fans this Diwali దీపావళికి శ్రీలీల ఫ్యాన్స్ కి డబుల్...

A Double Treat for Sreeleela Fans this Diwali దీపావళికి శ్రీలీల ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ?

sreeleela

ప్రస్తుతం టాలీవుడ్ లో యువ కథానాయికగా వరుసగా పలు అవకాశాలతో కొనసాగుతున్నారు శ్రీలీల. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నారు. 

ఇక ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా అడుగుపెట్టారు. తమిళ్ లో సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న పరాశక్తి మూవీలో ఆమె ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలానే ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా సిద్ధమైంది. 

లవ్ ఎమోషనల్ యాక్షన్ సిరీస్ అయిన ఆషికి 3లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన వీడియో క్లిప్స్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయితే విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా రానున్న దీపావళి పండుగ సందర్భంగా ఆడియన్స్ కి ముందుకు వచ్చ అవకాశం ఉంది. 

మొత్తంగా దీన్నిబట్టి శ్రీలీల ఫ్యాన్స్ కి రానున్న దీపావళికి డబుల్ ట్రీట్ లభించడం ఖాయంగా కనబడుతోంది. త్వరలో ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి అధికారిక రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఆయా సినిమాల యూనిట్ నుంచి వెల్లడి కానున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version