యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎప్పుడూ ఏ విషయం అయినా మొదటి నుండి ఎంతో ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. తమ హారికా హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై పలు సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించిన తాజాగా మరికొన్ని నిర్మిస్తున్న వంశీ, తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చారు.
సీక్వెల్ హైప్ తో వచ్చిన ఈ మూవీ ఓవరాల్ గా యువతని అయితే బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం తమ మూవీకి మంచి విజయం లబిస్తుండడంతో నేడు ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన నాగవంశీ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. నిజానికి ఒక సినిమా సక్సెస్ అయితే ఎంత కలెక్షన్ వస్తుందనేది తనకి డిస్ట్రిబ్యూటర్స్ నుండి క్లియర్ గా వస్తుందని, అందులో తాను ఫేక్ చేస్తే తనకే నష్టం కదా అన్నారు. ఇక కొందరు ఐతే మ్యాడ్ స్క్వేర్ సినిమా బాగుంది కానీ కేవలం సీక్వెల్ హైప్ తో ఆడుతోందని అనడం దారుణం అని అన్నారు.
తమ మూవీతో పాటు రిలీజ్ అయిన మరొక సినిమా బాగోలేకపోవడం వల్లనే తమది ఆడుతోందని అనడం కరెక్ట్ కాదని, సినిమాలో విషయం ఉంది, అందరినీ అది ఆకట్టుకుంటోంది కాబట్టే జనం థియేటర్స్ కి వస్తున్నారనేది గ్రహించాలని కోరారు. ఒకవేళ తమ సంస్థ నుండి వస్తున్న సినిమాల విషయంలో కావాలంటే వాటిని బ్యాన్ చేసి రివ్యూస్, రేటింగ్స్ ఇవ్వొద్దని, తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, తమ సినిమాలని ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది తనకి తెలుసనీ అన్నారు వంశీ. మొత్తంగా వంశీ చేసిన ఈ సంచలన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.