Home సినిమా వార్తలు మెగాస్టార్ కి జోడీగా ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ ?

మెగాస్టార్ కి జోడీగా ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ ?

chiranjeevi

ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

దీని అనంతరం ఇప్పటికే అనిల్ రావిపూడి తో తన మూవీ యొక్క పూజా కార్యక్రమాలను జరిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుండగా దీనిని వేగవంతంగా పూర్తి చేసి 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఎంటర్టైన్మెంట్ యాక్షన్ కమర్షియల్ హంగులతో అదిరిపోతుందని దీనికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్స్ గా పరిణితి చోప్రా ,అదితి రావు హైదరి ల పేర్లు ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాయని త్వరలో వీరిద్దరికి సంబంధించిన అనౌన్స్మెంట్ టీం నుంచి రానుందని చెప్తున్నారు. మొత్తంగా ఐదు పాటలు ఉండే ఈ సినిమాకి భీమ్స్ సిసిలోరియో అద్భుతమైన సాంగ్స్ అందిస్తుండగా ఇప్పటికీ మూడు సాంగ్స్ యొక్క కంపోజిషన్ పూర్తయిందట. 

ఓవరాల్ గా తనకిష్టమైన మెగాస్టార్ తో చేస్తున్న ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ విషయంలో పక్కాగా జాగ్రత్తలు తీసుకొని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని సాహూ గారపాటి తెలిపారు. తన బ్యానర్ పై ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version