Home సినిమా వార్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా ?

ntr neel

ఇటీవల పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించారు. 

మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. నటుడిగా ఈ సినిమాతో ఎన్టీఆర్ మరింతగా మార్కెట్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక మాస్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ కూడా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ అయితే వేగవంతంగా జరుగుతోంది. త్వరలో ఎన్టీఆర్ ఈ సినిమా యొక్క షూట్లో పాల్గొన్నారు. దీనికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా అప్డేట్ వస్తుందనే న్యూస్ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆరోజున ఎన్టీఆర్ నీల్ టీం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్. రానున్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పక్కాగా ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఉంటుందని అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు. 

కాగా ఈ సినిమాని జనవరి 2026 లో గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీం అయితే కసరత్తు చేస్తోంది. మరి తొలిసారిగా ఎన్టీఆర్, నీల్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీ ఎంత మేర విజయవంతం అవుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version