సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జైలర్. ఈ మూవీలో రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా తదితరులు కీలక పాత్రల్లో నటించగా తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్, కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు.
రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ అనంతరం ఇటీవల దీనికి సీక్వెల్ అయిన జైలర్ 2 మూవీని అనౌన్స్ చేసారు మేకర్స్. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. సన్ పిక్చర్స్ సంస్థ మరింత గ్రాండ్ గా నిర్మించనున్న ఈమూవీలో రజినీకాంత్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండనుందట.
విషయం ఏమిటంటే, నిన్నటి నుండి జైలర్ 2 రెగ్యులర్ షూట్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. ప్రస్తుతం ప్రారంభం అయిన ఈ షూట్ 15 రోజుల పాటు జరగనుండగా త్వరలో రజిని కూడా ఇందులో పాల్గొననున్నారట. నందమూరి బాలకృష్ణ ఈ మూవీలో ఒక పవర్ఫుల్ క్యామియో పాత్ర చేయనున్నట్లు టాక్. కాగా ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.