సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కూలీ. శృతిహాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్ వంటి వారు నటిస్తున్నారు.
ఇప్పటికే ప్రారంభ నాటి నుంచి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరచిన కూలీ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి.
ముఖ్యంగా నిన్న ఈ సినిమాకు సంబంధించి 100 డేస్ ఫర్ కూలీ అంటూ రిలీజ్ చేసిన ఒక చిన్న గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. కాగా అది అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ గ్లింప్స్ లో పలువురు పాత్రధారులని బ్యాక్ సైడ్ నుంచి చూపించారు.
ఓవరాల్ గా ఆ గ్లింప్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. మొత్తం మరొక 100 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానున్న కూలీ మూవీ ఏ స్థాయి విజయమందుకుంటుందో చూడాలి. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ సినిమాని సన్ పిక్చర్ సంస్థపై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్ లో అత్యధిక వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.