Home సినిమా వార్తలు మెగాస్టార్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ ?

మెగాస్టార్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ ?

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక దీని అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయనున్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా అతిపెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి, మెగాస్టార్ కోసం ఒక అద్భుతమైన స్టోరీని సిద్ధం చేశారు. 

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తోపాటు కేథరిన్ థెరిస్సా కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో వారిద్దరి పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యంగా ఈ సినిమా కామెడీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. 

సాహు గారపాటి తో పాటు మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదల కూడా భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ సినిమాకి బీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ క్రేజీ సినిమా 2026 సంక్రాంతి కానుక ఆడియన్స్ ముందుకు రానుంది. మరి అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన ఈ సినిమా ఏ స్థాయి విజయవంతం అవుతుందో వేచి చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version