Home సినిమా వార్తలు త్రివిక్రమ్ vs అనిల్ రావిపూడి 2026 సంక్రాంతి క్లాష్ ఫిక్స్ ?

త్రివిక్రమ్ vs అనిల్ రావిపూడి 2026 సంక్రాంతి క్లాష్ ఫిక్స్ ?

trivikram anil ravipudi

ప్రతి ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు భారీ సినిమాలు ఢీకొడుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమాలు క్లాష్ అయ్యాయి. అయితే వీటిలో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా డాకు మహారాజ్ మంచి విజయం అందుకుంది. 

ఇక గేమ్ చేంజెర్ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే రానున్న సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కోసం సిద్ధమవుతున్నాయి. అందులో ప్రధానంగా వెంకటేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న సినిమాతో పాటు మెగాస్టార్ తో అనిల్ రావిపూడి తీయనున్న సినిమాలపైనే అందరి కళ్ళు ఉన్నాయి. 

ఈ రెండు సినిమాలు కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి వెంకటేష్ తో త్రివిక్రమ్ కాంబో మూవీ పై వార్తలు వైరల్ అవుతుండగా మొత్తానికి ఫైనల్ గా అది తాజాగా ఫిక్స్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అతిత్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 

అయితే మరోవైపు మెగాస్టార్ తో అనిల్ రావిపూడి తీయనున్న సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా కూడా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ రెండు సినిమాలతో రానున్న సంక్రాంతికి అటు డైరెక్టర్స్ గా అనిల్ రావిపూడి, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య బాక్సాఫీస్ క్లాష్ అయితే ఏర్పడనుంది. 

విషయం ఏమిటంటే వెంకటేష్, అనిల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు, ఇక ఈ ఇద్దరు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నారు. కాగా వారిద్దరూ వచ్చే ఏడాది సంక్రాంతికి విడివిడిగా సినిమాల ద్వారా బాక్సాఫీస్ క్లాష్ కి సిద్దమవుతున్నారు. మరి ఈ క్లాష్ లో ఏ సినిమా ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version