తమిళ్ డెబ్యూ ‘మాండాడి’ తో సుహాస్ సక్సెస్ అందుకుంటారా ?

    mandaadi

    తెలుగు నటుడు సుహాస్ కలర్ ఫోటో సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా చేసిన సుహాస్ ఇటీవల ప్రతినాయకుడుగా కూడా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమా అవకాశాలతో కొనసాగుతున్న సుహాస్ తమిళ లో తాజాగా విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

    సూరి కథానాయకుడుగా తెరకెక్కుతున్న మండాడి సినిమాలో ఆయన తొలిసారిగా తమిళ్ డెబ్యూ ఇవ్వనున్నారు. ఈ సినిమాని వెట్రిమారన్ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. గతంలో సూరితో వెట్రిమారన్  తెరకెక్కించిన విడుదలై సిరీస్ సినిమాల్లో ఫస్ట్ పార్ట్ హిట్టు కాగా రెండోది ఆశించిన స్థాయి విజయం అందుకోలేదు.

    ఇక మండాడి సినిమాని యువ దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సుస్పరిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది. తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తొలిసారిగా తాను తమిళ్ లో ఎంట్రీ ఈ సినిమాని అందరూ ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు సుహాస్.

    ఇది బైలింగువల్ సినిమా అని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ అవుతుందని తాజాగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపారు సుహాస్. మరి తమిళ్ లో ఫస్ట్ మూవీ మండాడి తో సుహాస్ అక్కడి ఆడియన్స్ ని ఏస్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version