Home సినిమా వార్తలు SSMB 29 : భారీ వాటర్ యాక్షన్ సీన్

SSMB 29 : భారీ వాటర్ యాక్షన్ సీన్

ssmb29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్రస్తుతం జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB 29. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా మూడో షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ యాక్షన్ సీన్ అయితే చిత్రీకరించినందుకు టీం సన్నద్ధమవుతొందట. 

దాదాపుగా 3 వేలకు మందికి పైగా ఈ సన్నివేశంలో పాల్గొన్ననున్నారని, నీటిలో భారీ బోట్లు, షిప్ ల నడుమ దీనిని దాదాపుగా నెలన్నరకు పైగా తీస్తారట.

ఇప్పటికే ఈ సినిమాపై భారతీయు సినీ పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ లవర్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. విశ్వం చుట్టే వీరుడి కథగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ అత్యద్భుతంగా డిజైన్ చేయడంతో పాటు ఆద్యంతం ప్రతి సన్నివేశం అందర్నీ ఆకట్టుకునేలా జక్కన్న దీన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్.

వి విజయేంద్ర ప్రసాద్ కథనందించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ దీనిని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2027 సమ్మర్ కానుకగా మార్చి 25న ఆడియన్స్ ముందుకు రానున్నట్లు టాక్

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version