Home సినిమా వార్తలు ​రికార్డు టైంలో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన ‘ఎంపురాన్’

​రికార్డు టైంలో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన ‘ఎంపురాన్’

empuraan

మార్చి 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ పలు భాషలు ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియన్ మూవీ ఎంపురాన్ కొన్నేళ్ళ క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్. మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాని పృధ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించగా అందులో టోవినో థామస్ ఒక కీలక పాత్రలో కూడా కనిపించారు. 

దానితో ఎంపురాన్ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎంపురాన్ మాత్రం ఆ స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఎలివేషన్, యాక్షన్ సీన్స్ బాగానే తీసిన దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కథ కథనాల విషయంలో అంత శ్రద్ధ పెట్టలేదు. అయితే ఎంపురాన్ మూవీ ప్రీ బుకింగ్స్ పరంగా అదరగొట్టి బుక్ మై షో లో పెద్ద రికార్డు కొట్టింది. 

అలానే రిలీజ్ అయిన కేవలం రెండు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన మూవీగా ఎంపురాన్ మళయాళ చిత్రపరిశ్రమలో పెద్ద రికార్డు సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ మోహన్ లాల్ కు మూడవ రూ. 100 కోట్ల మూవీ. పులి మురుగన్, లూసిఫర్ అనంతరం ఆయన ఈ మూవీతో ఆ రికార్డు సొంతం చేసుకున్నారు. మరి మొత్తంగా ఎంపురాన్ ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version