Home సినిమా వార్తలు రూ. 50 కోట్ల క్లబ్ లో ‘కోర్టు’

రూ. 50 కోట్ల క్లబ్ లో ‘కోర్టు’

court

తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన కోర్టు యాక్షన్ డ్రామా మూవీ కోర్ట్. రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరించగా న్యాచురల్ స్టార్ నాని దీనికి సమర్పకుడుగా వ్యవహరించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే నుండి బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ సొంతం చేసుకుంది. 

శ్రీహర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ అందుకున్న కోర్టు మూవీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా బాగా కలెక్షన్ సాదించడం విశేషం. 

ఈ సినిమా మొదటి వారంలో దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుని తాజాగా రెండవ వారాంతంలో రూ. 50 కోట్ల ని దక్కించుకుంది. 8వ రోజు రూ. 2.7 కోట్లు 9వ రోజు రూ. 4.5 కోట్లు, 10వ రోజు రూ. 4 కోట్లు ఈ సినిమా సంపాదించింది. మొత్తంగా రూ. 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ అందుకోవటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. 

మరోవైపు అటు అమెరికాలో కూడా ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్ అందుకుంది. నాని బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో రూ. 50 కోట్లు అందుకున్న మొదటి మూవీగా కోర్టు నిలిచింది. ఇక తమ సినిమా ఈ స్థాయిలో ఆడియన్స్ ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ నెంబర్స్ సాదించడంతో కోర్టు మూవీ టీం ప్రత్యేకంగా ప్రేక్షకాభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. త్వరలో ఈ సినిమా ఓటీడీలోకి రానుంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version