తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు చేస్తూ ఆడియన్స్ యొక్క మనసు చూరగొంటూ కొనసాగుతున్న నటుల్లో శర్వానంద్ కూడా ఒక్కరు. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విభిన్న కథ కథనాలతో రూపొందే ఆయన సినిమాలు నటుడిగా ఆయనకు మంచి క్రేజ్ అందిస్తున్నాయి. ఆ విధంగా గతేడాది యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతి శెట్టి కలయికలో వచ్చిన మూవీ మనమే.
యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయమైతే అందుకోలేదు. అయితే నటుడిగా శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి తమ పాత్రల్లో అలరించే పెరఫార్మన్స్ కనబరిహరు. కాగా బాక్సాఫీస్ రన్ అనంతరం ఈ సినిమా యొక్క ఓటిటి కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు.
కాగా ఫైనల్ గా ఏడాది తర్వాత తాజాగా ఈ సినిమా ఓటీటి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా మనమే మూవీ మార్చి 9 నుంచి ప్రసారం కానుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ కృతి శెట్టి తో పాటు బాల నటుడు విక్రమాదిత్య పాత్ర కూడా అందర్నీ ఎంతో ఆకట్టుకుంది.
శీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, ఆయేషా ఖాన్, రాహుల్ రామకృష్ణ, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూర్చారు. మరి థియేటర్స్ లో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా ఎంత మేర ఓటిటి ఆడియన్స్ నిఅలరిస్తుందో చూడాలి.