బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల కలయికలో లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఛావా. మ్యాడాక్ ఫిలింస్ సంస్థపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా కీలకపాత్రల్లో అశుతోష్ రానా, డయానా పెంటి, దివ్య దత్త, అక్షయ్ ఖన్నా తదితరులు నటించారు.
హిందీలో ఇప్పటికే రూ. 500 కోట్లు దాటి రూ. 600 కోట్ల వైపు పరుగులు తీస్తున్న ఛావా మూవీ మార్చి 7న గ్రాండ్ గా తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. విషయం ఏమిటంటే నిన్న ఉదయం ఈ సినిమా యొక్క తెలుగు థియేట్రికల్ రిలీజ్ చేశారు. కాగా తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుంది.
ముఖ్యంగా తెలుగు వర్షన్ ట్రైలర్లో డబ్ చేసిన డైలాగ్స్ తో పాటు పవర్ఫుల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో విక్కీ కౌశల్ పెర్ఫార్మన్స్ మరింత ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా అయితే ఛావా తెలుగు ట్రైలర్ మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసిందని చెప్పాలి. మరి మార్చి 7న తెలుగులో రిలీజ్ అనంతరం ఛావా ఇక్కడ ఆడియన్స్ ని ఎంత మేర మెప్పించి ఏ స్థాయిలో కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమా యొక్క తెలుగు హక్కులని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వారు సొంతం చేసుకున్నారు అలానే తెలుగులో ఈ సినిమాని వీలైనంత ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు కూడా వారు ప్లాన్ చేస్తున్నారు.