Home సినిమా వార్తలు Did Mzaka get Jackpot or Disaster ‘మజాకా’ : జాక్ పాట్ కొడుతుందా లేక...

Did Mzaka get Jackpot or Disaster ‘మజాకా’ : జాక్ పాట్ కొడుతుందా లేక ఢమాల్ అంటుందా ?

mazaka

తాజాగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మజాకా. ఈ మూవీపై అటు సందీప్ కిషన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మొదటినుంచి మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఆకట్టుకుని ఇప్పటి వరకు మూవీ పై ఉన్న అంచనాలైతే భారీగా పెంచేసాయి. 

ఫిబ్రవరి 26 అనగా రేపు ఈ సినిమా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే ఈరోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ అయితే ప్రదర్శించనున్నారు. తమ సినిమా మీద నమ్మకంతోనే తాము ముందుగా స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శిస్తున్నామని, తప్పకుండా ఇది తమ టీంకి ఈ మూవీ మంచి విజయం అందిస్తుందని మూవీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు దర్శకుడు త్రినాధరావు తో పాటు హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ మజాకా ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగుతుందని అన్న వర్గాల ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుందని చెప్తున్నారు. మరి ఈ స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా మజాకా జాక్ పాటు కొడుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటల వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ మూవీని రాజేష్ దండా ,ఉమేష్ కె ఆర్ బన్సాల్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.  

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version