Home సినిమా వార్తలు Dragon Director Requests Mahesh Babu మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన డ్రాగన్ డైరెక్టర్ 

Dragon Director Requests Mahesh Babu మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన డ్రాగన్ డైరెక్టర్ 

mahesh babu

తాజాగా యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కయదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు అశ్వత్ మారి ముత్తు దర్శకత్వలో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ఫుల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్. 

ఈ మూవీ తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్ తో రిలీజ్ అయింది. అటు తమిళ్, ఇటు తెలుగులో రెండు చోట్ల పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్ తో ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా హీరో ప్రదీప్ రంగనాథన్ అదిరిపోయే యాక్టింగ్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు, దర్శకుడు అశ్వత్  మూవీ సక్సెస్ అవడంతో తాజాగా తెలుగు సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. 

ఈ సందర్భంగా దర్శకుడు అశ్వత్ మారి ముత్తు మాట్లాడుతూ, తమ సినిమాకి ఇంతటి విజయం అందించిన తెలుగు, తమిళ ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అశోక్ సెల్వన్ తో తాను తీసిన ఓ మై కడువలె మూవీ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, ఆ మూవీని ఎంతో మెచ్చుకోవడంతో అది ఎంతోమందికి రీచ్ అయిందని అన్నారు. ఆ విధంగా డ్రాగన్ మూవీ కూడా ఆయన చూసి తన అభిప్రాయాన్ని తెలపాలని, ఆ విషయం ఆయన వరకు తీసుకెళ్లండి అంటూ సరదాగా మాట్లాడుతూ చెప్పారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version