నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇటీవల మల్లిడి వశిష్ట తీసిన బింబిసార మూవీ మంచి విజయం అందుకుంది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ మూవీలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ పోషించారు. అయితే దాని అనంతరం ఆయన ట్రిపుల్ రోల్ చేసిన అమిగోస్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఆపైన వచ్చిన డెవిల్ కూడా పెద్దగా ఆడలేదు. దానితో వీటి అనంతరం చేయబోయే మూవీ విషయంలో ఒకింత జాగ్రత్త వహించిన కళ్యాణ్ రామ్, ఆ తరువాత యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడంతో పాటు తాజాగా టీజర్ కూడా రిలీజ్ అయిన ఈమూవీ అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. అయితే టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఇప్పటికే దీని యొక్క నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
కాగా కోస్తా ఆంధ్ర రూ. 12 కోట్లు, సీడెడ్ 3.7 కలిపి మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా రూ. 23-25 కోట్ల మధ్య జరిగింది. కాగా ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇది ఎక్కువని చెప్పాలి. మేలో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు ముస్తాబవుతున్న తమ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్.