సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ SSMB 29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరిలో ఎన్నో భారీ స్థాయి అంచనాలు కలిగిన ఈమూవీ 2027 ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ కొద్దిరోజుల క్రితం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ప్రారంభం అయింది.
కాగా నిన్నటితో ఈ షెడ్యూల్ కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం టీమ్ హైదరాబాద్ చేరుకుంది. కాగా ఏమాత్రం గ్యాప్ లేకుండా మరొక వారం రోజుల్లో తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో జరుపనున్నారట జక్కన్న అండ్ టీమ్.
ముఖ్యంగా ఈ మూవీ షూట్ విషయంలో ఎక్కడా కూడా బ్రేక్స్ లేకుండా అలానే విజువల్ ఎఫెక్ట్స్ కూడా అత్యధికంగా కలిగిన ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరిపేలా ఎప్పుడో ఏర్పాట్లు చేశారట. మరి అన్ని అనుకున్నట్లు జరిగితే మరొక రెండేళ్లలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రావడం ఖాయం.