Home సినిమా వార్తలు Prashanth Neel movie with Allu Arjun అల్లు అర్జున్ తో మూవీ చేయనున్న ప్రశాంత్...

Prashanth Neel movie with Allu Arjun అల్లు అర్జున్ తో మూవీ చేయనున్న ప్రశాంత్ నీల్ ?

allu arjun prashanth neel

ఇటీవల భారీ పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 తో అతిపెద్ద విజయం అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దాని అనంతరం త్వరలో అట్లీతో ఒక సినిమా చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఆపై త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేయనున్నారు అల్లు అర్జున్. ఈ రెండు సినిమాలు కూడా భారీ స్థాయిలో రూపొందనున్నాయి. 

ఇక ప్రస్తుతం అట్లీ సినిమాలో తన మేకవర్ కోసం ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ దాని యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం అతిత్వరలో కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ త్వరలో ఒక సినిమా చేయనున్నారని అంటున్నారు.

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారట. గతంలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయాలని భావించారట ప్రశాంత్ నీల్. అయితే అది అనుకోకుండా కుదరలేదని, మరోవైపు గేమ్ చేంజర్ పరాజయం అనంతరం అల్లు అర్జున్ తో ఒక భారీ సినిమా చేయాలని దిల్ రాజు భావించారని టాక్. 

అందుకే అటు అల్లు అర్జున్ ఇటు ప్రశాంత నీల్ ల కాంబినేషన్లో ఒక భారీ మూవి సెట్ చేస్తున్నందుకు రాజు సిద్ధమవుతున్నారని త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని అధికారికంగా వెల్లడి కానున్నయని చెప్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది పక్కాగా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అనేటువంటి వివరాలన్నీ తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version