టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఇటీవల ఆయన నుండి వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్, రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్స్ గా నిలవడమే.
వాస్తవానికి అంతకముందు ఇస్మార్ట్ శంకర్ మూవీతో పెద్ద విజయం అందుకున్న పూరి, ఈ రెండు సినిమాల వరుస దెబ్బలతో కోలుకోలేకుండా ఉన్నారు. అయితే ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జునకు పూరి జగన్నాథ్ ఒక స్టోరీ వినిపించారని వార్తలు వచ్చాయి.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో తన నెక్స్ట్ మూవీని చేసేందుకు సిద్ధమయ్యారు పూరి. ఇప్పటికే విజయ్ సేతుపతిని కలిసి ఒక మంచి స్టోరీ లైన్ వినిపించి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట. ఇది పట్టాలెక్కితే విజయ్ సేతుపతి నటించే తొలి డైరెక్ట్ తెలుగు మూవీ ఇదే అవుతుంది.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసిన ఈమూవీ యొక్క టైటిల్ తో పాటు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా త్వరలో అధికారికంగా అనౌన్స్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబో మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.