ప్రస్తుతం యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో సూర్య చేస్తున్న మూవీ రెట్రో. ఈ మూవీలో అందాల కథానాయిక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జయరాం, కరుణాకరన్, జాజు జార్జి, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు.
స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2D ఎంటర్టైన్మెంట్ సంస్థల పై కార్తేకేయన్ సంతానం తో కలిసి సూర్య, జ్యోతికగా ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు .ఈ మూవీ మే 1న ఆడియన్స్ ముందుకి రానుంది. దీని అనంతరం ఇప్పటికే ఆర్జే బాలాజీతో ఒక మూవీ కమిట్ అయ్యారు సూర్య. ఈ మూవీ పై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
కాగా మ్యాటర్ ఏమిటంటే, వీటి అనంతరం టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈమూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిర్మించనుండగా ప్రేమలు భామ మామితా బైజు ఇందులో హీరోయిన్ గా నటించనుంది.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్న ఈమూవీ మారుతీ కారు యొక్క ఇంజిన్ రూపకల్పన అంశం పై సాగుతుందట. మొత్తంగా ఆకట్టుకునే కథ, కథంలాతో రూపొందనున్న ఈమూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.