పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ హర్రర్ ఎంటర్టైనర్ సినిమా ది రాజాసాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్, వివేక కూచిబొట్ల గ్రాండ్ గా నిర్మిస్తున్న ది రాజాసాబ్ సినిమా వాస్తవానికి ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది.
అయితే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర వర్కులు పెండింగ్ కారణంగా మూవీ మరికొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ పాన్ ఇండియన్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
అతిత్వరలో దీనికి సంబంధించిన మిగిలిన తన పార్ట్ షూటింగ్ ని ప్రభాస్ పూర్తి చేయనున్నారని అలానే జూన్ మొదటి వారంలో ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారని చెప్తున్నారు.
తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు ప్రభాస్ మార్క్ యాక్షన్ అంశాలను కలగలిపి దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజాసాబ్ సినిమా భారీ విజయం ఖాయమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.