తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ సినిమా అఖండ 2. మూడున్నరేళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద విజయం అందుకున్న అఖండ సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే కొంతవరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా మిగతా పార్ట్ షూట్ జరుపుకుంటోంది. దీన్ని సెప్టెంబర్ చివర్లో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే దీని అనంతరం గోపీచంద్ మలినేని తో నటసింహం బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇటీవల బాలయ్య తో వీరసింహారెడ్డి మూవీ తీసి మంచి విజయం అందుకున్న గోపీచంద్ ఈసారి అంతకంటే మించిన అత్యద్భుత కథతో బాలకృష్ణ వద్దకు వెళ్లి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు.కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు జూన్ 8న జరగనున్నట్లు తెలుస్తోంది.
అలానే దీనిని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు టీమ్ అయితే సిద్ధం అవుతుందట. ఓవరాల్ గా తనకి ఇష్టమైన బాలకృష్ణ తో రెండోసారి చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీ యొక్క స్క్రిప్టుపై దర్శకుడు గోపీచంద్ ఎంతో కేర్ తీసుకున్నారని ఈ సినిమా మరింత భారీ విజయం ఖాయమని టీం అయితే అభిప్రాయపడుతోంది.