ఇటీవల తమిళంలో మంచి విజయం అందుకున్న యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా గరుడన్. దీనిని భైరవం టైటిల్ తో తెలుగులో మల్టీస్టారర్ గా తెలుగులో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ లో కాంబినేషన్లో విజయ కనకమయెడల తెరకెక్కించారు. ఈ సినిమా మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది.
మొదటి నుండి ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధ మోహన్ భారీ స్థాయిలో నిర్మించారు. అదితి శంకర్ తో పాటు ఆనంది, దివ్య పెళ్లై హీరోయిన్స్ గా నటించిన భైరవంలో వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషించారు.
ఓవరాల్ గా ఇటీవల సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ లతో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ముఖ్యంగా ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు నారా రోహిత్, మంచి మనోజ్ ల టెరిపిక్ పెర్ఫార్మన్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి అదిరిపోయాయి. మరి మే 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంత మేర తెలుగు ఆడియన్స్ అలరించి ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.