Home సినిమా వార్తలు ‘హిట్ – 3’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

‘హిట్ – 3’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

hit 3 review

నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ అందాల నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ సినిమా హిట్ 3. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నాని తన సహజ నటనతో మరొకసారి అందరినీ ఆకట్టుకున్నారు.

ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 100 కోట్ల గ్రాస్ ని అలానే రూ. 50 కోట్ల షేర్ ని దక్కించుకుంది. అయితే ఫస్ట్ వీక్ బాగానే రాబట్టిన ఈ సినిమా రెండవ వారం నుంచి చాలా వరకు కలెక్షన్ తగ్గుముఖం పట్టింది.

అయితే విషయం ఏమిటంటే హిట్ 3 మూవీ నెట్ ఫిక్స్ లో జూన్ 5 నుంచి పలు భాషలు ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు థియేటర్స్ లో తమ సినిమా బాగా పెర్ఫామ్ చేయడంతో దర్శకుడు శైలేష్ కొలను హీరో నానితో పాటు టీమ్ ఆనందం వ్యక్తం చేస్తుంది.

త్వరలో హిట్ 4 మూవీ ప్రారంభిస్తామని ఇందులో కార్తీ పాత్ర మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 3 సినిమా విజయంతో నటుడిగా నాని మరింత ఉన్నత స్థాయికి చేరారు. తాజాగా శ్రీకాంత్ ఓదెలతో ఆయన ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version