Home సినిమా వార్తలు ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ కి కారణం అదా ?

‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ కి కారణం అదా ?

game changer

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈమూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. అయితే మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి బాక్సాఫిస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. వాస్తవానికి ఈ మూవీకి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నారని తెలిసినప్పటి నుండి అందరిలో సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం వచ్చింది.

దానిపై ఇటీవల కార్తీక్ మాట్లాడుతూ, నిజానికి తాను శంకర్ కి కథని అందించినపుడు అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ అని, అనంతరం అది పలువురు రచయితల చేతికి చేరి పలు మార్పులు చేర్పులు చేయడం వలన చివరికి ఆ విధంగా పరాజయం పాలయిందని అంటున్నారు. దీనిని బట్టి గేమ్ ఛేంజర్ పరాజయానికి అసలు కారణం అదే అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఆయన చెప్పిన విధంగా శంకర్ దానిని తెరకెక్కించి ఉంటె రిజల్ట్ ఎలా ఉండేదో ఏమో మరి.    

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version