Home సినిమా వార్తలు ‘ఖలేజా’ ప్రీ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్

‘ఖలేజా’ ప్రీ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్

khaleja

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 15 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన కామెడీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ సినిమా ఖలేజా. కనకరత్న మూవీస్ బ్యానర్ పై సింగనమల రమేష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రఘుబాబు, తణికెళ్లభరణి, బ్రహ్మానందం నటించారు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ కి యష్ భట్, సునీల్ పటేల్ ఫోటోగ్రఫి అందించారు. అయితే అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టిన ఈ మూవీ ఓవరాల్ గా ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ టివిలో ప్రసారం అయిన ప్రతిసారి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది.

ఇక మే 30న ఖలేజా మూవీ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయింది. మరోవైపు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బుకింగ్స్ ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇటీవల మహేష్ బాబు నటించిన మురారి సినిమా రీరిలీజ్ లో అత్యధిక కలెక్షన్ అందుకుని టాప్ స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం ఖలేజా ప్రీ బుకింగ్స్ పరంగా చూస్తే ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా దీనిపై భారీ స్థాయి క్రేజ్ ఉందని తెలుస్తోంది. మరోవైపు బుక్ మై షో టికెట్ బుకింగ్ యాప్ లో భారీగా బుకింగ్స్ జరుపుకుంటున్న ఖలేజా మూవీ ఓవరాల్ గా రూ. 10 కోట్లను దాటేసి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో నిలిచే అవకాశం గట్టిగా కనబడుతుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version