జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అవుతాయనేటువంటి విషయం ఇటీవల బయటకు వచ్చిన తరువాత అది పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఓపెన్ గా అది కుట్ర అంటూ స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు. ఆయనతో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా థియేటర్ల బంద్ పై గట్టిగా స్పందించారు.
అయితే దీని వెనక కొందరున్నారని ముఖ్యంగా దిల్ రాజు, శిరీష్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు అల్లు అరవింద్ వంటి వారు కావాలని టార్గెట్ గా థియేటర్ మేనేజ్మెంట్ తో ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా వీటిపై తాజాగా స్పందించారు అల్లు అరవింద్ మరియు దిల్ రాజు. వారిద్దరికీ థియేటర్స్ బంద్ కి సంబంధం లేదని వాస్తవానికి పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్ సినిమా వస్తుందంటే థియేటర్స్ బంద్ చేసే సాహసం ఎవరికీ ఉండదని వారిద్దరూ ప్రత్యేకంగా మీడియా మీటింగ్స్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు.
కాగా ఈ విషయమై సురేష్ బాబు మాత్రం ఇంకా స్పందించలేదు. కాగా ఆయన స్పందన పై పలువురు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా ప్రచారం అవుతుంది. మరి రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతున్న ఈ విషయం రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.