Home సినిమా వార్తలు ‘హిట్ – 3’ : క్లియర్ బాక్సాఫీస్ విన్నర్ 

‘హిట్ – 3’ : క్లియర్ బాక్సాఫీస్ విన్నర్ 

hit3

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను తీసిన తాజా సినిమా హిట్ 3. ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో రావు రమేష్, కోమలి ప్రసాద్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాల, సముద్రఖని, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

యూనానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ నుండే సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మూవీలో అర్జున్ సర్కార్ గా నాచురల్ స్టార్ కనబరిచిన నటనకు అందరి నుండి మంచి పేరు లభించింది.

ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన హిట్ 3 మూవీ తాజాగా రూ. 100 కోట్ల, రూ, 50 కోట్ల షేర్ తో చాలా ప్రాంతాల్లో జీఎస్టీ మినహాయించి, పలు ప్రాంతాల్లో జీఎస్టీ కలుపుకుని  బ్రేకివెన్ దాటేసింది. అయితే ఈ వీకెండ్ లో మూవీ మరింతగా రాబడితే పెద్ద విజయం అందుకోవచ్చు. మరోవైపు హిట్ 3 మూవీ సీడెడ్ ఏరియా లో మాత్రం బ్రేకీవెన్ ని అందుకోలేదు.

అది చేరుకోవాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా బాగా రాబట్టాలి. ఏ రేటెడ్ మూవీ అయినప్పటికీ కూడా ఆడియన్స్ ని మెప్పించి మొత్తంగా మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు హీరో నాని. త్వరలో శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ మూవీ చేయనున్నారు నాని.  

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version