పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ముందుగా హరి హర వీర మల్లు మూవీకి సంబంధించి తాజాగా తన పార్ట్ మొత్తం షూట్ పూర్తికి చేసారు పవన్ కళ్యాణ్.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది. అలానే త్వరలో ఓజి తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించి కూడా తన పార్ట్ షూట్ పూర్తి చేసేందుకు పవన్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలు కూడా త్వరలో పూర్తి కానుండగా వీటిలో ఈ ఏడాది ఓజి మూవీ ఆడియన్సు ముందుకి రానున్నట్లు చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఓజి అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.
ఈ మాస్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీని సుజీత్ తెరకెక్కిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఓజి మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి ఈ న్యూస్ కనుక నిజం అయితే పవన్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది డబుల్ బొనాంజా ఖాయం అని చెప్పొచ్చు.