నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అఖండ 2. మూడున్నరేళ్ల క్రితం రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న అఖండ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రిల్స్ ప్లస్ సంస్థపై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే వాస్తవానికి సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతుందని చాలారోజుల క్రితం మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు. కాగా తాజాగా అదే డేట్ కి తమ సినిమా రిలీజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఓజి మూవీ టీమ్ అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది.
దానితో అఖండ 2 మూవీ మరికొన్ని నెలలు వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం డిసెంబర్ లో అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందట.