మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథాలజికల్ ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థల పై గ్రాండ్ లెవెల్ లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితమవుతున్న కన్నప్ప సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కి స్తుండగా కీలకపాత్రల్లో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ వంటి ప్రముఖ స్టార్స్ నటిస్తున్నారు.
ఇక తాజాగా అలా మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు మంచి విష్ణు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా యొక్క రన్ టైం 3 గంటల 10 నిమిషాలు అన్నారు.
ఇక ప్రభాస్ కనిపించే సన్నివేశాలు మొత్తం సినిమాలో 30 నిమిషాలు ఉంటాయని అలానే మోహన్ లాల్ ఈ సినిమాలో దాదాపుగా 15 నిమిషాల వరకు కనిపిస్తారని వీరిద్దరి పాత్రలో సినిమాలో ఎంతో ప్రాధాన్యతతో సాగుతాయని చెప్పుకొచ్చారు.
తన తండ్రి మోహన్ బాబు, అక్షయ్ కుమార్ వంటి నటులు పాత్రలు కూడా ఎంతో బాగుంటాయని ఓవరాల్ గా తామందరం ఎన్నో నెలల నుంచి కష్టపడి చేసిన కన్నప్ప జూన్ 27న పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయం అందుకోవటం ఖాయం అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు మంచు విష్ణు.