ఇటీవల సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి ల కలయికల వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా తర్కెక్కిన ఈ సినిమాని గ్రాండ్ లెవెల్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.
బీమ్స్ సిసిలోరియో సంగీతం అందించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ అందరి నుంచి విశేషమైన రెస్పాన్స్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఓవరాల్ గా దాదాపు వరల్డ్ వైడ్ రూ. 150 కోట్ల వరకు షేర్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా యొక్క ఓటిటి రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
విషయం ఏమిటంటే ఈ మూవీకి యొక్క డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని భారీ ధరకు జీ సంస్థ సొంతం చేసుకుంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటిటి కంటే ముందే టీవీలో ప్రసారం కానుంది. కాగా మార్చి 9న ఈ మూవీ జీలో ప్రసారం కానుండగా అదే రోజు అనంతరం మార్చి 10న జీ 5 ఓటీటిలో విడుదల కానుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. మరి థియేటర్స్ లో అందర్నీ ఆకట్టుకొని భారీ బ్లాక్ బస్టర్ సాధించిన ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.