నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా కీలకపాత్రలు పోషించారు.
అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన డాకు మహారాజ్ మూవీ ఇటీవల సంక్రాంతి కానుక విడుదలై మంచి సక్సెస్ అయితే అందుకుంది. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య దీన్ని గ్రాండ్ గా నిర్మించారు.
ఇక డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడు బాబి టేకింగ్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ అయితే లభించింది. విషయం ఏమిటంటే ఈ మూవీ నిన్న అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటిపి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఐదు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటిలో ఆడియన్స్ ని ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.