Home సినిమా వార్తలు Puri Jagannath to do Golimaar Sequel with Gopichand గోపీచంద్ తో ‘గోలీమార్’ సీక్వెల్...

Puri Jagannath to do Golimaar Sequel with Gopichand గోపీచంద్ తో ‘గోలీమార్’ సీక్వెల్ తీయనున్న పూరి జగన్నాథ్ ?

puri jagannath

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ ఇటీవల కెరీర్ పరంగా వరుసగా డిజాస్టర్లను చవిచూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయం అందుకుని లైన్లోకి వచ్చిన పూరీ జగన్నాథ్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో తీసిన లైగర్, అలానే ఇటీవల ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 సినిమాలతో ఘోరమైన డిజాస్టర్స్ చవిచూడాల్సి వచ్చింది. 

దానితో ఆయన తదుపరి ఎవరితో వర్క్ చేస్తారు అనే సందిగ్ధత అందరిలో నెలకొంది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ ప్రకారం అతి త్వరలో గోపీచంద్ తో పూరి జగన్నాథ్ ఒక సినిమాను చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం గోపీచంద్ తో పూరి తీసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గోలీమార్ మంచి విజయం అందుకుంది. 

కాగా తాజాగా ఆ సినిమా యొక్క సీక్వల్ కథతోనే గోపీచంద్ తో పూరి మూవీ తీయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆ కథని బ్యాంకాక్ లో పూరి రాస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమాని ఒక భారీ నిర్మాణ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మించనుండగా అతిత్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయట.  మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version