నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ హిట్ 3. హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా రిలీజ్ అయిన హిట్ 1 సినిమాలో యువనటుడు విశ్వక్సేన్ నటించగా ఆ మూవీ మంచి విజయం అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన హిట్ 2 లో అడివి శేషు హీరోగా కనిపించగా అది కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా హిట్ 3 మూవీ నాని హీరోగా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కెజిఎఫ్ సిరీస్ సినిమాల నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో హైప్ మాత్రం రావడం లేదు. హిట్ 1, హిట్ 2 రెండు సినిమాలు విజయవంతం అయినప్పటికీ అవి అన్ని వర్గాల ఆడియన్స్ కి చేరువ కాలేదు. వాటి అనంతరం వెంకటేష్ తో శైలేష్ తీసిన సైంధవ్ ఫ్లాప్ కావడం కూడా హిట్ 3 కి హైప్ రాకపోవడానికి కారణం. విషయం ఏమిటంటే ఫిబ్రవరి 24 న ఈ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేయనున్నారు టీమ్.
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నాని స్వయంగా తన వాల్ పోస్టర్ సినిమా సంస్థ తోపాటు యునానిమస్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాగా హిట్ 3 మూవీ మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుండగా ఇందులో విశ్వక్సేన్ తో పాటు అడవి శేష్ చిన్న పాత్రల్లో కనిపించనున్నారు.