సినిమా పేరు: రాబిన్‌హుడ్
రేటింగ్: 2.5/5
తారాగణం: నితిన్, శ్రీ లీల, రాజేంద్ర ప్రసాద్, ఆడుకలం నరేన్ తదితరులు
దర్శకుడు: వెంకీ కుడుముల
నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ: 28 మార్చి 2025
యువ నటుడు నితిన్ హీరోగా అందాల కథానాయిక శ్రీలీల హీరోయిన్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, ఆడుకాలం నరేన్ సహా మరికొందరు కీలక పాత్రలు చేసారు.
జివీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకుని అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. మరి నేడు రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
అనాధ అయిన రామ్ (నితిన్) చిన్నప్పుడు తన తోటి ఆనాధలు ఆకలి కోసం పడే ఆవేదన చూసి ఎంతో వేదన చెందుతాడు. అదే సమయంలో బాగా డబ్బున్న వారి నుండి దానం దోచుకునివి వాటిని ఇటువంటి ఆనాధల కోసం వినియోగించాలని భావిస్తాడు.
అదే సమయంలో విలన్ అయిన సామి (దేవదత్త నాగే) తన గంజాయి వ్యాపారాన్ని గ్లోబల్ గా విస్తరించాలని భావిస్తాడు. అయితే రుద్రకొండ గ్రామంలో అరుదైన గంజాయి పెరుగుతుందని అతడు తెలుసుకుంటాడు. అదే సమయంలో రీనా వాసుదేవ్ (శ్రీలీల) రుద్రకొండకు బయలుదేరుతుంది.
అయితే ఆస్ట్రేలియాలో ఏవి ఫార్మా (రీనా తండ్రి) అధిపతి అభినవ్ వాసుదేవ్ (సిజ్జు) తో సామికి సంబంధం ఏమిటి? అనంతరం రీనాతో రామ్ సెక్యూరిటీ గార్డ్ గా ఎందుకు చేరాలనుకుంటాడు, ఇంతకీ డ్రాగ్ లార్డ్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) ఎవరు, మొత్తంగా వీరందరికీ కథతో కనెక్షన్ ఏమిటి, ఏవిధంగా కథ సాగిందనేది మొత్తం తెరపై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా ఈ మూవీలో రామ్ గా నితిన్ మరొక్కసారి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక శ్రీలీల తన అలరించే అందం అభినయంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు. రాజేంద్ర ప్రసాద్ పాత్రతో పాటు కామెడీ కూడా బాగానే పండింది. విలన్ గా చేసిన దేవదత్తే నాగే నటన కూడా బాగుంది. ఇక షైన్ టామ్ చాకో, ఆడుకలం నరేన్, లాల్, శుభలేఖ సుధాకర్ ల పాత్రలు కూడా పర్వాలేదు.
విశ్లేషణ :
ముఖ్యంగా తన కథలని కామెడీ తో పాటు మంచి యాక్షన్ జోడించి ఆకట్టుకునే రీతిగా తీసే దర్శకుడు వెంకీ కుడుముల రాబిన్ హుడ్ విషయంలో మాత్రం చాలా తడబడ్డారు. పూర్తిగా నార్మల్ కథని ఎంచుకోవడంతో పాటు చాలా వరకు ఊహించదగ్గ కథనంతో దీనిని నడిపారు.
కొన్ని ఫార్మాలిటిక్ ఎలిమెంట్స్ తో మూవీని ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఎంటెర్టైమెంట్ పండాలి, కానీ ఈ మూవీ విషయంలో అది మిస్ అయింది. అయితే ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ల కామెడీ సీన్స్ బాగున్నాయి.
అయితే మెయిన్ లీడ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకోవు. పోస్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగున్నా, ఇంటర్వల్ సాధాసీదాగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా మాములుగా సాగగా, అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి. అనేక సినిమాల మాదిరిగా ఎంతో పవర్ఫుల్ గా విలన్ ని చాలా వరకు చూపించి చివరకు క్లైమాక్స్ లో వీక్ చేసిన మాదిరిగానే ఇందులో కూడా చూపించారు.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేదు. అయితే ప్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చే పలు ఎమోషనల్ సీన్స్ తో పాటు హీరో పాత్ర గురించి కీలక విషయాలు బాగానే కుదిరాయి అయితే అద్భుతంగా మాత్రం లేవు. ఎంతో హైప్ చేసిన డేవిడ్ వార్నర్ క్యామియో చాలా నార్మల్ గా ఉంటుంది, ప్రత్యేకత ఏమి ఉండదు.
ప్లస్ పాయింట్స్ :
- ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్
- కొన్ని కీలకమైన సీన్స్/డైలాగ్స్
- శ్రీలీల గ్లామర్
మైనస్ పాయింట్స్ :
- వీక్ సెకండ్ హాఫ్
- డల్ పార్ట్స్
- పాటలకు సరికాని పరిస్థితులు
తీర్పు :
మొత్తంగా ఎన్నో అంచనాల నడుమ నెడు ఆడియన్స్ ముందుకి వచ్చిన రాబిన్ హుడ్ మూవీ అక్కడక్కడా ఆడియన్స్ ని కొద్దిగా నవ్వించినప్పటికీ పూర్తి స్థాయిలో చాలావరకు ఆకట్టుకోదు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ సీన్స్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయి. శ్రీలీల గ్లామర్ సీన్స్ అలానే నితిన్ యాక్టింగ్ తప్ప సినిమా అంతా ఎంతో సదా సీదాగా సాగుతుంది.