Home సమీక్షలు ‘మ్యాడ్ స్క్వేర్’ రివ్యూ : అక్కడక్కడ మాత్రమే నవ్వించే బోరింగ్ మూవీ

‘మ్యాడ్ స్క్వేర్’ రివ్యూ : అక్కడక్కడ మాత్రమే నవ్వించే బోరింగ్ మూవీ

mad square review

సినిమా పేరు: మ్యాడ్ స్క్వేర్

రేటింగ్: 2.75/5

తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ

దర్శకుడు: కళ్యాణ్ శంకర్

నిర్మాత: హారిక సూర్యదేవర

విడుదల తేదీ: 28 మార్చి 2025

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ :

మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నితిన్ నార్నే), మరియు దామోదర్ -డిడి (సంగీత్ శోభన్) అందరూ కలిసి తమ తోటి స్నేహితుడైన లడ్డు (విష్ణు ఓఐ) కి రావడం అనంతరం ఆ సందర్భంలో కొన్ని ఆసక్తికర సరదా పరిణామాలు చోటు చేసుకోవడంతో వాటిని వారు ఏవిధంగా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ మూవీ కథ సాగుతుంది. 

నటీ నటుల పెర్ఫార్మన్స్

ముఖ్యంగా ఇటీవల వచ్చిన మ్యాడ్ మంచి విజయం అందుకోవడంతో అంతకుమించి మరింత ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ ని అందించాలని దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈమూవీ యొక్క కథని రాసుకున్నారు.

ఇక ప్రధాన పాత్రల్లో నటించిన  నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ అందరూ కూడా మరొక్కసారి తమ తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్ తో పాటు కీలక పాత్ర చేసిన సునీల్, శుభలేఖ సుధాకర్ కూడా ఆకట్టుకున్నారు. అయితే ఆంటోనీ మరియు సత్యం రాజేష్ ల పాత్రలు మరింతగా రాసుకోవాల్సింది. 

విశ్లేషణ

మ్యాడ్ మూవీ మాదిరిగా మ్యాడ్ స్క్వేర్ కూడా పూర్తిగా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే కథతో సాగుతుంది. ఇక కీలక నటీనటులు అందరూ కూడా మంచి పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని అలరించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ ఎలిమెంట్స్, లడ్డు పెళ్లి సందర్భంగా వచ్చే సీన్స్, బాగున్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో మురళీధర్ గౌడ్ అలానే సునీల్ సీన్స్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి.

అయితే దర్శకుడు కథ కోసం ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కథనంలో కొన్ని సీన్స్ కోసం బలవంతంగా కామెడీ జొప్పించినట్లు అనిపిస్తుంది, కొంత ఆడియన్స్ కి అది ఫోర్స్డ్ గా కూడా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా నార్మల్ గానే ఉంటుంది. మొత్తంగా పార్ట్ వన్ ని మించేంతటి రియల్ ఫన్ ని మ్యాడ్ స్క్వేర్ అందించలేదు. 

ప్లస్ పాయింట్స్

  • ప్రధాన తారాగణం నుండి వినోదాత్మక ప్రదర్శనలు
  • సరదా ఎపిసోడ్‌లు
  • స్వాతి రెడ్డి పాట

మైనస్ పాయింట్స్

  • పునరావృత / బలవంతపు హాస్యం
  • బోరింగ్ సీన్స్
  • సంగీతం

తీర్పు

మొత్తంగా చెప్పాలి అంటే మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓవరాల్ గా ఐతే జస్ట్ పర్వాలేదనిపిస్తుంది అంతే. అక్కడక్కడా కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ నవ్వించగా మరికొన్ని ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. అయితే కొన్ని సరదా సీన్స్, స్వాతి రెడ్డి పాట, కీలక నటీ నటుల యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version