సినిమా పేరు: బాపు
రేటింగ్: 2.5/5
తారాగణం: బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, రచ్చ రవి తదితరులు.
దర్శకుడు: కె. దయాకర్ రెడ్డి
నిర్మాత: రాజు సి.హెచ్. భాను ప్రసాద్ రెడ్డి
విడుదల తేదీ: 21 ఫిబ్రవరి 2025
తాజాగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రూరల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ బాపు. ఈ మూవీలో బలగం సుధాకర్ రెడ్డి, బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉందనేది పూర్తి రివ్యూ లో చూద్దాం
కథ :
తెలంగాణలో జెసిబి ఆపరేటర్ అయిన చంటి (రచ్చ రవి) కథతో ఈ మూవీ ప్రారంభం అవుతుంది. గుప్తనిధుల మీద నమ్మకంతో తవ్వగా అతడికి బంగారు విగ్రహం దొరకడం జరుగుతుంది. అనంతరం దానితో రెండు జేసీబీలు కొనుగోలు చేస్తాడు.
అయితే అనంతరం కొన్ని ఊహంచని పరిణామాల ద్వారా అతడి వద్ద ఉన్న బంగారు విగ్రహాన్ని ఎవరో దొంగతనం చేస్తారు. మరోవైపు పత్తి రైతు అయిన మల్లయ్య (బ్రహ్మాజీ), అతడి తండ్రి రాజయ్య (సుధాకర్ రెడ్డి), భార్య సరోజ (ఆమని)మరియు పిల్లలతో ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతుంటాడు. అయితే కథనం కొంత సాగిన అనంతరం చంటి వద్ద మిస్ అయిన బంగారు విగ్రహ నిధి కోసం పన్నిన పథకం మనకి తెలుస్తుంది. కాగా మిగతా కథ అంతా ఎలా సాగింది అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముందుగా పత్తి రైతుగా ఆర్ధిక సమస్యలతో సతమతం అయ్యే రైతు మల్లయ్య పాత్రలో బ్రహ్మాజీ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. అలానే ఆయన భార్య సరోజ గా ఆమనీ, తో పాటు యువ నటుడు మణి, నటి ధన్య బాలకృష్ణ అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు.
కీలక పాత్రధారి సుధాకర్ రెడ్డి బలగం అనంతరం ఇందులో కూడా అలరించారు. ఆయన కామెడీ టైమింగ్ ఎంతో బాగుంది. ఇక శ్రీనివాస్ అవసరాల కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. చిన్న పాత్ర అయినప్పటికీ కూడా రచ్చ రవి పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.
విశ్లేషణ :
తెలంగాణ రూరల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో సస్పెన్స్ తో పాటు ఎమోషనల్ అంశాలు ఆకట్టుకుంటాయి. ఈ మూవీ యొక్క కథనం ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. కథలో నిజాయితీ, పాత్రధారుల యొక్క హృద్యమైన పెర్ఫార్మన్స్ సినిమాలో బాగా కలిసి వచ్చే అంశాలు. ఇక దర్శకుడు దయాకర్ రెడ్డి ఈ మూవీని కామెడీ, సస్పెన్స్ తో పాటు ఆకట్టుకునే అంశాలతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా కుదిరాయి. అయితే ఓవరాల్ గా ఈ మూవీ యొక్క పాయింట్ ప్రకారం ఒక కుటుంబం మొత్తం కూడా ఒక మర్డర్ కి ప్లాన్ చేయడం అనే అంశం చుట్టూ సాగె ఈ కథకి మరింత క్లియర్ నెరేషన్ అవసరం. చాలావరకు అంతా ఊహాజనితంగానే సాగుతుంది. నటుడు మణి ఎగుర్ల రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకోదు.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మన్స్ లు
- భావోద్వేగ సన్నివేశాలు
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
- నెమ్మదిగా సాగే కథనం
- ఊహించదగిన సీన్స్
- తప్పుగా నడిచే కొన్ని పాత్రలు
తీర్పు :
ఓవరాల్ గా తెలంగాణలోని రూరల్ ప్రాంతంలో సాగె బాపు మూవీ అక్కడక్కడా కొన్ని సస్పెన్స్ అంశాలతో కొంత ఉహిచదగినదిగా సాగె ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు. కథనం కొంత నెమ్మదిగా సాగినప్పటికీ పాత్రధారుల యొక్క పెర్ఫార్మన్స్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.