ఇటీవల సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీతో పాన్ ఇండియన్ రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీ ఓవరాల్ గా రూ. 1670 కోట్ల గ్రాస్ అయితే సొంతం చేసుకుంది.
దీని అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థల వారి సినిమా అల్లు అర్జున్ చేయల్సీ ఉంది. ఇది భారీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అత్యధిక వ్యయంతో రూపొందనుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆ సినిమాని కొన్నాళ్ళు పక్కన పెట్టి దాని ప్లేస్ లో అట్లీతో అల్లు అర్జున్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. పుష్ప 2 తర్వాత వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించారు అల్లు అర్జున్. దానికి తగ్గట్లు మంచి మాస్ కమర్షియల్ మూవీ చేయాలనేది ఆయన ఆలోచనట. ఇక అట్లీ కూడా జవాన్ మూవీతో అతిపెద్ద విజయం అందుకున్నారు.
అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దీనిని భారీ వ్యయంతో నిర్మించనుంది.యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ దీనికి సంగీతం సమకూర్చనుండగా త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్టు గురించిన అఫీషియల్ న్యూస్ రానుంది.