దివంగత స్టార్ నటి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ తొలిసారిగా ధడక్ మూవీ ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. అక్కడి నుండి పలు సినిమాల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం నటిగా వరుస అవకాశాలతో ఆమె కొనసాగుతున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద విజయం అందుకున్న జాన్వి తాజాగా రాంచరణ్, బుచ్చిబాబు సన ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ మూవీ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ఆమె మరికొన్ని ఆఫర్లు అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఒకదాని వెంట మరొకటి నటిగా జాన్వీ అవకాశాలతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకుంటూ కొనసాగుతున్నారు.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మరికొన్ని సినిమాలు ఆమె సైన్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా తల్లి శ్రీదేవి మాదిరిగానే జాన్వి కపూర్ కూడా చిత్ర పరిశ్రమలో అత్యద్భుత క్రేజ్, మార్కెట్తో దూసుకెళ్తున్నారని చెప్పాలి.