Home సినిమా వార్తలు Rishab Shetty Movies Lineup was Interesting ఇంట్రెస్టింగ్ గా రిషబ్ శెట్టి మూవీస్ లైనప్

Rishab Shetty Movies Lineup was Interesting ఇంట్రెస్టింగ్ గా రిషబ్ శెట్టి మూవీస్ లైనప్

rishab shetty

కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ సెట్టి కాంతారా సినిమాతో పాన్ ఇండియన్ స్థాయిలో హీరోగా అందరి నుంచి విశేషమైన క్రేజ్ అందుకున్నారు. ఆ సినిమా ఓవరాల్ గా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా కాంతారా మూవీకి మంచి క్రేజ్ తో బాగానే కలెక్షన్ కూడా లభించింది. ఇక దానికి సీక్వెల్ అయినా కాంతారా చాప్టర్ 1 సినిమా చేస్తున్నారు రిషబ్ శెట్టి. 

ఈ మూవీ 300-400 ఏడి మధ్యలో సాగనుండగా ఇది కనుక మంచి విజయం అందుకుంటే ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల వరకు రాబట్టే అవకాశం కనబడుతోంది. మరోవైపు ఈ సినిమా అనంతరం ఇప్పటికే ప్రశాంత్ వర్మతో హనుమాన్ కి సీక్వెల్ అయిన జై హనుమాన్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు రిషబ్.  హనుమాన్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

వీటితోపాటు తాజాగా బాలీవుడ్ లో చత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను కూడా చేసేందుకు సిద్ధమయ్యారు రిషబ్ శెట్టి. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రిలీజ్ అయి అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 21 జనవరి 2027లో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇది కూడా కనుక విజయవంతం అయితే నటుడిగా రిషబ్ శెట్టి నేషనల్ వైడ్ గా మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం గట్టిగా కనబడుతోంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version