టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇటీవల డిసెంబర్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియన్ మూవీ అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది.
రావు రమేష్, ఫహాద్ ఫాసిల్, అజయ్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక వరల్డ్ వైడ్ ఓవరాల్ గా పుష్ప 2 మూవీ రూ. 1670 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ కేరళ లో మాత్రం ఫైనల్ గా డిజాస్టర్ గా నిలిచింది.
కేరళ లో అల్లు అర్జున్ కి క్రేజ్ ఎక్కువ ఉండడంతో అప్పట్లో ఈ మూవీ పెద్ద విజయం అందుకుని బాగా కలెక్షన్ రాబడుతుందని అందరూ భావించారు. అయితే పుష్ప 2 మూవీ తమ రాష్ట్రంలో డిజాస్టర్ అవడంపై నేడు జరిగిన పుష్ప సక్సెస్ మీట్ లో భాగంగా కేరళ నిర్మాత మాట్లాడారు.
ఇది టిపికల్ మలయాళం స్టైల్ లో సాగె మూవీ కాకపోవడంతో ఇక్కడి ఆడియన్స్ అంతగా ఆదరించలేదని అన్నారు. వారు మూవీకి కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని, త్వరలో పుష్ప 2 మూవీని 3డి వర్షన్ లో తమ ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు తెలిపారు.