యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా మాస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ మూవీ యొక్క షూటింగ్ నేడు గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ని దాదాపుగా పది రోజుల పాటు చిత్రీకరించనున్నారు.
Ntr Neel Movie Shoot Begins
అనంతరం జరుగనున్న రెండవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. ఇక నేటి ఫస్ట్ షెడ్యూల్ తాలూకు ఆన్ లొకేషన్ పిక్ ని టీమ్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేసింది. వందలాది మందితో దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ తన కెరీర్ లో పోషించని ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు.

మలయాళ నటుడు టోవినో థామస్ కీలకపాత్ర చేస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతాన్ని భువన గౌడ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ మూవీ యొక్క షూట్ పూర్తి చేసి దీనిని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ ఏర్పాట్లు చేస్తోంది.