Home సినిమా వార్తలు Pushpa 2 Movie Ticket prices reduced పుష్ప – 2 టికెట్ ధరల తగ్గింపు

Pushpa 2 Movie Ticket prices reduced పుష్ప – 2 టికెట్ ధరల తగ్గింపు

pushpa 2

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప డిసెంబర్ 5న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన ఈమూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ దీనిని భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో పుష్ప రాజ్ గా మరొక్కసారి పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ అందరి నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా గడచినా మూడు రోజుల్లో రూ. 600 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువవుతున్న ఈ మూవీ యొక్క టికెట్ రేట్స్ ని తెలంగాణలో సోమవారం నుండి తగ్గించనున్నారు.

కాగా తెలంగాణలో సోమవారం నుండి మల్టిప్లెక్స్ లో రూ. 450 అలానే సింగిల్ స్క్రీన్స్ లో రూ. 200 గా ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోని ఈ మూవీ టికెట్ రేట్స్ తగ్గింపు తరువాత మరింతగా కలెక్షన్ తో పాటు ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version