Home సినిమా వార్తలు kanguva HD print leaked in internet ఇంటర్నెట్ లో ‘కంగువ’ HD ప్రింట్ లీక్

kanguva HD print leaked in internet ఇంటర్నెట్ లో ‘కంగువ’ HD ప్రింట్ లీక్

kanguva

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలపై గ్రాండ్ గా నిర్మితమైన తాజా పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా పూర్తిగా అందరిని డిసప్పాయింట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ పోషించుగా హీరోయిన్ గా దిశ పటాని కనిపించారు.

సూర్య సూపర్ పెర్ఫార్మన్స్ కనబరిచినప్పటికీ కంటెంట్ అయితే ఆకట్టుకోలేదు. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీ డిసెంబర్ రెండో వారంలో వాస్తవానికి ఓటిటి ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉండగా ఇప్పటికే ఇటు ఇంటర్నెట్లో ఈ మూవీ యొక్క HD ప్రింట్ లీక్ అయింది. ప్రస్తుతానికి మీడియా మాధ్యమాల్లో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది.

ఒక రకంగా ఇది కంగువ టీంకి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఓవైపు సినిమా కూడా చాలా చోట్ల డిజాస్టర్ గా నిలిచి భారీ నష్టాలు మిగల్చడం, మరోవైపు ఈ విధంగా ఇటు HD ప్రింట్ కూడా అప్పుడే బయటకు రావడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఓటిటిలో రిలీజ్ అయిన అనంతరం కంగువ మూవీ రెస్పాన్స్ అయితే ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version