Home సినిమా వార్తలు Kanguva Getting Low Response in OTT also ఓటిటిలో కూడా కంగువ కి చుక్కెదురు

Kanguva Getting Low Response in OTT also ఓటిటిలో కూడా కంగువ కి చుక్కెదురు

kanguva

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. శివ తెరకెక్కించిన ఈ మూవీని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అయితే ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఊహించని స్థాయిలో భారీ నష్టాలని చవిచూసిన ఈ మూవీ పై అన్ని భాషల ఆడియన్స్ నుండి విపరీతమైన విమర్శలు వెల్లువెత్తాయి. భారీ ఖర్చు అయితే ఉందని, కానీ ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో మూవీ మూవీ ప్లాప్ అయిందని చెప్పవచ్చు. ఇక థియేటర్స్ లో ఏమాత్రం ఆకట్టుకోని ఈ మూవీ అటు తాజాగా ఓటిటి లో రిలీజ్ అయి కూడా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క నిడివి ఒరిజోనల్ థియేటర్ వర్షన్ తో పోలిస్తే 12 నిముషాలు తగ్గి మొత్తంగా 141 నిమిషాల నిడివితో ఓటిటిలోకి వచ్చింది. ఇక ఓటిటి ఆడియన్స్ కూడా ఈ మూవీ చూడడం పై నిరాసక్తత కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆడియన్స్ ఈ మూవీ ఓటిటి వర్షన్ పై నెగటివిటీ అందుకుంటోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version