Home సినిమా వార్తలు Pushpa 2 Movie Footage 100 Minutes Trimmed ‘పుష్ప – 2’ 100 నిమిషాల...

Pushpa 2 Movie Footage 100 Minutes Trimmed ‘పుష్ప – 2’ 100 నిమిషాల ఫుటేజ్ ట్రిమ్ చేశారట

pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఫహాద్ ఫాసిల్, జగపతిబాబు, అజయ్, రావురమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈమూవీలో సుకుమార్ స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోనప్పటికీ అల్లు అర్జున్ పెరఫార్మన్స్ కి మాత్రం అందరి నుండి మంచి పేరు లభిస్తోంది. విషయం ఏమిటంటే, మొత్తంగా 3 గం. 20 ని. ల నిడివి గల ఈ మూవీ యొక్క రన్ టైంలో ఎడిటింగ్ టైం లో 100 నిమిషాల ఫుటేజ్ ని ట్రిమ్ చేశారట. అందులో విలన్ భన్వర్ సింగ్ షకవత్ తో పాటు మరికొన్ని కీలక సీన్స్ ఉన్నాయట.

అయితే అప్పటికే మూవీ యొక్క లెంగ్త్ ఎక్కువ కావడంతో అవి కట్ చేయకతప్పలేదట. కాగా పుష్ప 2 కి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయి రెస్పాన్స్ ఐతే రావడం లేదు. మిగతా ప్రాంతాల్లో మూవీ బాగానే కలెక్షన్ రాబడుతోంది. మరి దీనికి సీక్వెల్ అయిన పుష్ప 3 అసలు ఉంటుందో లేదో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version