Home సినిమా వార్తలు Yash Toxic Release Date Fix యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Yash Toxic Release Date Fix యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

toxic

కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు కన్నడ స్టార్ నటుడు యష్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలు రెండు కూడా ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత సక్సెస్ లు సొంతం చేసుకున్నాయి.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సక్సెస్ లతో హీరోగా నేషనల్ వైడ్ ఎంతో క్రేజ్ అందుకున్నారు యష్ దాని అనంతరం కెరీర్ పరంగా ఆలోచన చేసి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యష్. ఈ మూవీని కెవిఎన్ ప్రొడక్షన్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది ఈ మూవీ.

అయితే విషయం ఏమిటంటే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది అనగా 2025 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజగా ప్రకటించారు. వాస్తవానికి ఈ మూవీ 2025 ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొంతమేర షూటింగ్ లేట్ కావడంతో మరొక ఆరు నెలలు రిలీజ్ వాయిదా పడింది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ కీలక పాత్ర చేస్తోంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version