Home సినిమా వార్తలు Mechanic Rocky OTT Streaming Details ‘మెకానిక్ రాఖీ’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

Mechanic Rocky OTT Streaming Details ‘మెకానిక్ రాఖీ’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

mechanic rocky

టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా మెకానిక్ రాఖీ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని యువ దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరేక్కించగా ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. 

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. జెక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, నరేష్, సునీల్, హైపర్ ఆది, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు చేసారు. కాగా విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డీటెయిల్స్ తాజాగా అనౌన్స్ అయ్యాయి. 

కాగా ఈమూవీ ఓటిటి హక్కులని ప్రముఖ డిజిటల్ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 19న అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ మూవీ ఫెయిల్యూర్ తో నటుడిగా ఇకపై మరింతగా కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టారు విశ్వక్ సేన్. మరి ఓటిటి లో మెకానిక్ రాఖీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version